ఎన్టీఆర్ సినిమాకు ఫేక్ ఎకౌంట్ ప్రాబ్లమ్స్

Sun,February 7, 2016 12:28 PM
fake accounts for ntr movie

జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్ర సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉండగా, తాజాగా జనతా గ్యారేజ్ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తోండగా , మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఫేక్ ఎకౌంట్స్ ను ఫేస్ బుక్ , ట్విట్టర్లలో క్రియేట్ చేస్తోండగా నిర్మాతలు ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

జూనియర్ 26వ చిత్రం జనతా గ్యారేజ్‌కు సంబంధించి కొన్ని ఫేక్ అంతటా కనిపిస్తోండగా, వాటిని నమ్మోద్దు . అలాంటివి కనిపిస్తే మాకు రిపోర్ట్ చేయండి, ఇది మాత్రమే సినిమాకు సంబంధించిన పేజ్ అని వారు తమ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మరి సినిమా పట్టాలెక్క ముందే ఎన్టీఆర్ సినిమాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి పడుతుండడంతో, నిర్మాతలు వీటిపై పూర్తి కాన్సన్‌ట్రేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


2706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles