హీరోకు బ్లడ్ తో లెటర్ రాసిన అభిమాని

Wed,November 30, 2016 11:26 AM

ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎన్నో మార్గాలున్నాయి. కొందరు సక్రమ మార్గంలో వెళ్ళి ఎదుటి వ్యక్తి ప్రేమను దక్కించుకుంటే, మరి కొందరు వక్రమార్గాల ద్వారా తమ ప్రేమను వ్యక్త పరుస్తూ లైఫ్ ని రిస్క్ లో పడేసుకుంటున్నారు. తాజాగా మలయాళి అభిమాని తన అభిమాన హీరోపై ఉన్న ప్రేమను లెటర్ ద్వారా వ్యక్తపరచింది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి తన బ్లెడ్ తో లెటర్ రాయడం. మాలీవుడ్ హీరో కాళిదాస్ జయరామ్ కి సదరు అభిమాని ‘కన్నెట్ట లవ్ యూ’ అని బ్లడ్ తో లెటర్ రాసి పంపింది. ఈ లెటర్ చూసిన కాళిదాస్ జయరామ్ ఈ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్ కి సందేశాన్ని ఇచ్చాడు. దయచేసి ఎవరు ఇలాంటి పనులు చేయోద్దని, మేము చేసే సినిమాలు ఆదరించి మంచి సక్సెస్ చేస్తే అంతకు మించిన లవ్ మరొకటి ఉండందంటూ ఈ హీరో రిక్వెస్ట్ చేశాడు. కాళిదాస్ జయరామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పూమారం చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

2555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles