చర్చలకు గాయకుడు మికాసింగ్ కు ఆహ్వానం

Mon,August 19, 2019 03:20 PM
Film Body to Meet Mika Singh Tomorrow to Discuss Ban from industry

ప్రముఖ సింగర్ మికాసింగ్ పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ బంధువు పెండ్లిలో సంగీత కచేరి నిర్వహించడంపై భారతీయ సినీ కార్మిక సంఘాలు (ఏఐసీడబ్ల్యూఏ, ఎఫ్ డబ్ల్యూసీఈ)ఆయనపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మికాసింగ్ రెండు అసోసియేషన్లకు ఓ లేఖ రాశాడు. నిషేధం విధించే ముందు తన అభిప్రాయాన్ని తీసుకోవాలని మికా సింగ్ రెండు అసోసియేషన్లకు లేఖ రాశాడు.

దీనిపై ఎఫ్ డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారి మాట్లాడుతూ..అసోసియేషన్లు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని మికాసింగ్ లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తాను ఏమైనా తప్పు చేసి ఉంటే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అప్పటివరకు తనపై ఎలాంటి నిషేధం విధించవద్దని కోరారు. అసోసియేషన్ ప్రతినిధులు ఆగస్టు 20 న మికాసింగ్ ను కలుస్తారు. ఈ సమావేశం పూర్తయేవరకు మేం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపారు.

ఎఫ్ డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారి మాట్లాడిన ఓ వీడియోను మికా సింగ్ షేర్ చేశాడు. నా అభిప్రాయాన్ని, మనోభావాల్ని అర్థం చేసుకున్న బీఎన్ తివారీకి ధన్యవాదాలు. నా సమాజానికి, దేశానికి, ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తా. జై హింద్ అని ట్వీట్ చేశాడు మికాసింగ్.

1289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles