సైరా సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. భారీగా ఆస్తి న‌ష్టం

Fri,May 3, 2019 08:21 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహ‌రెడ్డి చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం కోకాపేట‌లోని చిరంజీవి ఫాం హౌజ్లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో జ‌రుగుతుంది. అయితే ఈ సెట్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఫాం హౌజ్ నుండి ద‌ట్ట‌మైన పొగ‌లు, మంట‌లు వ‌స్తుండడాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. గండిపేట లేక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థతిని సమీక్షించారు. సెట్ పూర్తిగా కాలిపోయిన‌ట్టు తెలుస్తుండ‌గా, దాదాపు 2 కోట్ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉండొచ్చ‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న జ‌రిగిందా లేదంటే మ‌రేదైన కార‌ణం వ‌ల‌న జ‌రిగిందా అనే దానిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న సైరా చిత్రం స్వాతంత్య్ర స‌మరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత నేప‌థ్యంలో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. అమితాబ్ బ‌చ్చ‌న్, సుదీప్, త‌మ‌న్నా, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.1970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles