స‌వ్య‌సాచి వ‌చ్చేస్తున్నాడు

Sun,March 4, 2018 10:10 AM

అమాయకంగా, అందంగా కనిపించే హీరో ఎవరంటే నాగచైతన్య ఠక్కున గుర్తుకొస్తాడు. 2009లో జోష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంటరయిన చైతూ ఆ తర్వాత ఏం మాయ చేశావే, దడ, 100% లవ్, బెజవాడ, తడాఖా, మనం, ఒక లైలాకోసం, ఆటో నగర్ సూర్య, దోచెయ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో, ఆటాడుకుందాం రా, రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం సినిమాలు చేశాడు. ఒక్క 2012లో తప్ప ప్రతి ఏటా చైతూ పిక్చర్స్ రిలీజయ్యాయి.


ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మాధ‌వ‌న్, భూమిక‌లు ముఖ్య పాత్ర‌లు పోషించారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం జూన్ 14న విడుద‌ల కానుంద‌ని మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ఇక ఫ‌స్ట్ లుక్‌ని మార్చి 18న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు తెలిపారు. కీర‌వాణి సంగీతం చిత్రానికి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అవుతుందని నిర్మాత‌లు అంటున్నారు. ఇదిలా ఉంటే చైతూ .. మారుతి ద‌ర్శ‌క‌త్వంలోను ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles