అక్ష‌య్ కుమార్ 'ల‌క్ష్మీ బాంబ్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,October 3, 2019 01:49 PM

ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు లారెన్స్ కాంచ‌న చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొంద‌నున్న ఈ చిత్రంలో భ‌ర‌త్ అనే నేను ఫేం కియారా అద్వాని క‌థానాయిక‌గా న‌టిస్తుంది . ‘లక్ష్మీ బాంబ్’ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ద‌స‌రా శుభాకాంక్ష‌ల‌తో విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌లో అక్ష‌య్ కుమార్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. సీరియ‌స్‌గా క‌నిపిస్తూ అభిమానుల‌లో అంచ‌నాలు పెంచుతున్నాడు . జూన్ 5, 2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మ‌రోవైపు అక్ష‌య్ ..రోహిత్ శెట్టి డైరెక్ష‌న్‌లో సూర్యవంశీ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. 2020 ఈద్ కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.

1806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles