'సైరా'లో విజయ్‌ సేతుపతి లుక్ చూశారా?

Wed,January 16, 2019 11:31 AM


మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్.. రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా అతనికి బర్త్‌డే విషెస్ చెబుతూ.. చిత్రంలో విజయ్ పాత్రకు సంబంధించిన మోషన్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, కిచ్చ సుదీప్, తమన్నా వంటి ప్రముఖ నటులు చిత్రంలో కనిపించనున్నారు.


4332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles