మ్యాథ్స్ జీనియ‌స్ శంకుతల దేవిగా విద్యా బాల‌న్‌.. ఫ‌స్ట్ లుక్

Tue,September 17, 2019 09:27 AM

బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్ బ‌యోపిక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న‌ సంగ‌తి తెలిసిందే . ఇటీవ‌ల ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన క‌థానాయ‌కుడు చిత్రంలో బ‌స‌వ‌తారకం పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసిన విద్యా, మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ బ‌యోపిక్‌లోను న‌టిస్తుంది . రోనీ స్క్రూవాలా .. ఇందిరా గాంధీకి సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని సేక‌రించి ఆడియ‌న్స్‌కి న‌చ్చేలా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం సాగ‌రిక ఘోష్ రాసిన ఇందిరా : ఇండియాస్ మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ ప్రైమ్ మినిస్ట‌ర్ పుస్తకం ఆధారంగా రూపొందుతుంది. అతి త్వ‌ర‌లోనే మూవీ సెట్స్ పైకి వెళుతుంద‌ని విద్యా పేర్కొన్నారు. క‌ట్ చేస్తే విద్యా మ్యాథ్స్ జీనియ‌స్ శంకుతల దేవి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. లేడీ డైరెక్టర్ అను మీనన్ తెరకెక్కించనున్న ఈచిత్రాన్ని విక్రమ్ మల్హోత్రా నిర్మించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కానుంది. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో విద్యా లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. శ‌కుంత‌ల దేవి ఓ హ్యూమ‌న్ కంప్యూట‌ర్. ఐదు సంవ‌త్స‌రాల వ‌యస్సులో 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న విద్యార్ధుల మ్యాథ్స్ ప్రాబ్ల‌మ్స్‌ని సులువుగా సాల్వ్ చేసింది. శ‌కుంత‌ల దేవి పాత్ర‌లో న‌టించ‌డం చాలా అదృష్టంగా భావిస్తున్న‌ట్టు విద్యా గ‌తంలో పేర్కొంది.

672
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles