తల్లిదండ్రులు ఈ టీజర్ తప్పక చూడాల్సిందే..!

Sat,March 16, 2019 03:11 PM
First Rank Raju Movie Teaser

హైదరాబాద్: చేతన్ మద్దినేని, కాశిష్ వోరా జంటగా నటించిన చిత్రం 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. 'విద్య 100% బుద్ధి 0%' అని పెట్టిన ట్యాగ్‌లైన్ లాగానే సినిమాలో హీరో చేసిన కామెడీ హైలెట్‌గా నిలిచింది. సీనియర్ టాలీవుడ్ నటులు ప్రకాశ్ రాజ్, నరేష్, ప్రియదర్శి, బ్రహ్మానందం, రావు రమేశ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాను డాల్ఫిన్ ఎంటర్‌టైన్‌మెంట్- మారుతీ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడలో విజయవంతమైన ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో కూడా నరేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టీజ‌ర్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

ప్రస్తుత జనరేషన్‌లో తల్లిదండ్రులు పిల్లలను ఎలా పెంచుతున్నారు. పిల్లలకు పేరెంట్స్ మధ్య ప్రతీ కుటుంబంలో తరచుగా చోటుచేసుకునే కొన్ని ముఖ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. చదువు మాత్రమే కాదు.. సమాజంపై అవగాహన, మిగతా విషయాలు తెలియకపోతే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో కళ్లకు కట్టినట్టు చిత్రంలో చక్కగా చూపించారు డైరెక్టర్.

2391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles