యాసిడ్ బాధితురాలి పాత్ర కోసం నాలుగు గంటల మేక‌ప్

Sat,April 13, 2019 08:25 AM
four hours time for deepikas make up

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రం ఛ‌పాక్. ఈ మూవీలో దీపికా.. యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపిస్తున్నది. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. రాజీ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ప్లే చేయడంతోపాటు సినిమా ప్రొడ్యూసర్ కూడా దీపికానే కావడం విశేషం. ఇటీవ‌ల దీపికా లుక్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుద‌ల‌య్యాయి. ఇందులో దీపికా అచ్చు గుద్దిన‌ట్టు.. ల‌క్ష్మీ అగ‌ర్వాల్ మాదిరిగానే క‌నిపించింది. అయితే ప‌ర్‌ఫెక్ట్ మేక‌ప్‌తో ల‌క్ష్మీ అగ‌ర్వాల్‌లా అచ్చు గుద్దిన‌ట్టు దీపిక‌ని రెడీ చేయ‌డానికి నాలుగు గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇక ఆ మేక‌ప్ తీసేందుకు కూడా చాలా టైం ప‌డుతుంద‌ట‌. పద్మావత్ తర్వాత దీపికా న‌టిస్తున్న ఛ‌పాక్ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానుంద‌ని స‌మాచారం.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles