మ‌హేష్ బాబు ఫ్యామిలీ నుండి మ‌రో హీరో..!

Thu,November 7, 2019 12:00 PM

మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ అక్టోబ‌ర్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి సూప‌ర్ స్టార్ కృష్ణ‌,రాఘ‌వేంద్ర‌రావు, మంజుల, దిల్ రాజు తదితరులు హాజ‌ర‌య్యారు. చిత్రానికి తొలి క్లాప్ కృష్ణ కొట్టారు. శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కాల్సి ఉన్న ఈ చిత్రం ప‌లుకార‌ణాల వ‌ల‌న ఆగింది. ఈ చిత్రానికి అదే నువ్వు అదే నేను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా అశోక్ డెబ్యూ మూవీకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది


అశోక్ డెబ్యూ చిత్రం న‌వంబ‌ర్ 10న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకి గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంపిక చేసార‌నే విష‌యం తెలియాల్సి ఉంది. అశోక్ కొన్నాళ్ళుగా అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో న‌ట‌న‌కి సంబంధించిన శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తుంది. సూప‌ర్ స్టార్ కృష్ణ వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెర‌పై మ‌రో సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు మ‌హేష్ బాబు. ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ కూడా 1 నేనొక్క‌డినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మ‌హేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల‌, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెర‌పై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.

3462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles