క‌ట్ట‌లు తెంచుకున్న కోపం.. విధ్వంసం సృష్టించిన ప్ర‌భాస్ ఫ్యాన్స్

Sat,August 31, 2019 08:47 AM

అభిమానుల‌కి ఆనందం వ‌చ్చిన‌, కోపం వ‌చ్చిన అస్స‌లు త‌ట్టుకోలేం. ఆనందం వ‌స్తే నెత్తిన పెట్టుకొని ఊరేగుతారు. అదే కోపం వ‌స్తే బీభ‌త్సమైన విధ్వంసం సృష్టిస్తారు. తాజాగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. థియేట‌ర్‌లో ఫ‌ర్నీచ‌ర్ మొత్తం ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సాహో చిత్రం ఎన్నో అంచ‌నాల మ‌ధ్య శుక్ర‌వారం విడుద‌లైంది. ఈ సినిమాకి మొద‌టి షో నుండే నెగెటివ్ టాక్ రావ‌డంతో ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. సినిమా బాగోలేద‌నే కోపంతో భీమ‌వ‌రంలోని ఓ థియేట‌ర్‌లో ఉన్న ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం చేశారు. కుర్చీల‌న్నీ విర‌గ్గొడుతున్న ఓ వీడియో సోష‌ల్ మీడియ‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. సినిమా రిలీజ్‌కి ముందు భీమ‌వ‌రంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ భారీ క‌టౌట్ ఏర్పాటు చేయ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఎంతో ఆక‌ర్షించింది. క‌టౌట్స్ చూసి కొన్ని కొన్ని న‌మ్మేయాలి డ్యూడ్ అని చెప్పుకొచ్చారు. బాహుబ‌లి లాంటి భారీ హిట్ సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ ఇలాంటి సినిమా చేయ‌డం అభిమానుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌డం లేదు.


21202
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles