లండ‌న్‌లో ఫ్యామిలీతో క్రిస్మ‌స్ వేడుక‌ జ‌రుపుకున్న ప్రియాంక

Wed,December 26, 2018 11:37 AM

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో, 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత ఢిల్లీలో ఓ రిసెప్ష‌న్‌, ముంబైలో రెండు రిసెప్ష‌న్స్ జ‌రుపుకున్నారు. వీరి పెళ్లి కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్రియాంక చోప్రా దంప‌తులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి లండ‌న్‌లో క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుపుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రియాంక చోప్రా త‌ల్లి మ‌ధు చోప్రా, సోద‌రుడు సిద్ధార్ధ్‌తో పాటు ప‌లువురు స‌న్నిహితులు పాల్గొన్నారు. ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పార్టీకి సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ తెలిపింది. పార్టీలో ప్రియాంక చోప్రా త‌న బావ ఫ్రాంకీ జోనాస్ ప‌క్క‌న కూర్చోని ఉండ‌గా, ఆమె ఎదురుగా నిక్ జోనాస్ కూర్చొని ఉన్నారు. నిక్ జోనాస్ కూడా క్రిస్మ‌స్ వేడుక‌కి సంబంధించిన ఫోటోల‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ ఫోటోలు ఆక‌ట్టుకుంటున్నాయి.


View this post on Instagram

Christmas strolls from ours to yours.

A post shared by Nick Jonas (@nickjonas) on

2052
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles