బిగ్ బాస్ ప్రేక్ష‌కుల‌కి బిగ్ స‌ర్‌ప్రైజ్‌..!

Sun,September 8, 2019 11:21 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం రాను రాను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఇంటి నుండి ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కి వెళుతుండ‌డంతో పోటీ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. ఈ రోజు ఎవ‌రు ఊహించ‌ని విధంగా అలీ రాజా బిగ్ బాస్ ఇంటిని వీడి వెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కొద్ది సేప‌టి క్రితం స్టార్ మా ప్రోమోని విడుద‌ల చేసింది. ఇందులో నాని బిగ్ బాస్ వేదిక‌పై అడుగుపెట్టాడు. నా..ని... టీవీ అంటూ ఇంటి స‌భ్యుల‌కి స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. నానిని చూసి హౌజ్‌మేట్స్ నోరెళ్ళ‌పెట్టారు. బిగ్ బాస్ సీజ‌న్ 2ని హోస్ట్ చేసిన నాని ఈ ఎపిసోడ్‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడా లేదంటే త‌న తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం హాజ‌ర‌య్యాడా అనేది తెలియాల్సి ఉంది.



3436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles