వైజాగ్‌లో గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Tue,September 10, 2019 10:14 AM

జెర్సీ చిత్రం త‌ర్వాత నాని న‌టించిన చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ చేశారు. వైజాగ్‌లోని గురుజాడ క‌ళాక్షేత్రంలో ఈ వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సాయంత్రం 6గం.ల నుండి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని పోస్ట‌ర్‌లో తెలిపారు.


విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందింది . ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టించ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్‌గా అల‌రించ‌నున్నారు. కార్తికేయ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు.

573
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles