షాకింగ్ న్యూస్: చిరు సినిమా రీమేక్ చేయనున్న చరణ్

Wed,June 13, 2018 03:36 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగా స్టార్ చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడనే వార్త ప్రస్తుతం దావానంలా పాకింది. ఇటీవల జరిగిన తేజ్ ఐ లవ్ యూ ఆడియో వేడుకలో చిరు మాట్లాడుతూ.. చరణ్ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో ఓ సినిమా చేస్తాడని చెప్పాడు. ఆ సినిమా గ్యాంగ్ లీడర్ కి రీమేక్ అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.ఒరిజినల్ కథని ఈ జనరేషన్ కి తగ్గట్టు మార్చి సినిమాని రీమేక్ చేయాలని కేఎస్ రామారావు ప్రయత్నిస్తున్నారట.

విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ 1991లో మే 9న విడుదలై భారీ విజయం సాధించింది. ఈ విజయం చిరంజీవి మాస్ ఇమేజ్ పటిష్టం కావడానికి చాలా దోహదం చేసింది. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మురళీ మోహన్, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బప్పీలహరి సంగీతం ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. మరి ఈ సినిమాని చరణ్ రీమేక్ చేయడం ఓ రకమైన సాహసం అనే చెప్పవచ్చు. రాజమౌళి మల్టీ స్టారర్ తర్వాత చరణ్ చేయబోవు ప్రాజెక్ట్ గ్యాంగ్ లీడర్ రీమేక్ అంటుండగా, దీనిపై క్లారిటీ రావలసి ఉంది. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు చరణ్.

3870
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles