సీను సిరిగి.. సీట్లు ఇరిగి.. సీటి కొట్టాలోయీ

Fri,September 6, 2019 08:47 AM
Gang-u Leader Promotional Video

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన తాజా చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతుంది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్ర‌లో నాని న‌టిస్తుండ‌గా, ఆయ‌న ఫేమ‌స్ రివెంజ్ రైట‌ర్‌గా అల‌రించ‌నున్నారు . కార్తికేయ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు . ఇటీవ‌ల విడుద‌లైన చిత్ర ట్రైల‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా చిత్ర ప్ర‌మోష‌న‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో నాని, అనిరుధ్ చేసిన సంద‌డి అద‌రిపోయింద‌నే చెప్పాలి. Scene-u సిరిగి.. Seat -lu ఇరిగి.. Seeti కొట్టాలోయీ అంటూ సాగే ఈ పాట ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు.

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles