ఆగ‌స్ట్‌లో 'గ్యాంగ్ లీడ‌ర్' హంగామా

Fri,May 17, 2019 01:07 PM
GangLeader Releasing Worldwide on Aug 30th, 2019

నేచుర‌ల్ స్టార్ నాని జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. రీసెంట్‌గా జెర్సీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన నాని ఆగ‌స్ట్ 30న గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంతో థియేట‌ర్స్‌లోకి రానున్నాడు. తాజాగా ఈ విష‌యాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. గ్యాంగ్ లీడ‌ర్ చిత్రం విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ప్రియాంక‌, ల‌క్ష్మీ , శ‌ర‌ణ్య‌, అనీష్ కురువిళ్ళా, ప్రియ‌ద‌ర్శి, ర‌ఘుబాబు, వెన్నెల కిషోర్, జైజా, స‌త్య త‌దిద‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇందులో అయిదుగురు అమ్మాయిలు దొంగ‌లుగా ఉంటారని వారికి నాయ‌కుడిగా నాని ఉంటారట‌. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. మే 14 నుండి శంషాబాద్‌లో మూడో షెడ్యూల్ స్టార్ట్ అయింది. జూన్ 30కి చిత్ర షూటింగ్ మొత్తం పూర్తి కానుంద‌ట‌. నాని- విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో బాక్సాఫీస్‌ని షేక్ చేయడం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రోవైపు నాని .. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.


1344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles