శివాజీ రాజా త‌న‌యుడి సినిమా మొద‌లైంది

Sun,June 16, 2019 07:23 AM

ప్ర‌ముఖ న‌టుడు శివాజీ రాజా త‌న‌యుడు విజ‌య రాజా హీరోగా ఓ చిత్రం రూపొంద‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌నివారం విజ‌య‌రాజా డెబ్యూ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయింది. రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప్రముఖులు సి. కల్యాణ్, అజయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, ఉత్తేజ్, సంపూర్ణేష్ బాబు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎస్వీ కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సి. కల్యాణ్ క్లాప్‌ కొట్టారు, గుంగుల ప్రతాప్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. జూలై రెండో వారం నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ చిత్రానికి జెమ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రాశీ సింగ్‌ కథానాయిక. ఈ సినిమాతో సుశీల సుబ్రమణ్యం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని శివాజీ రాజా అన్నారు. కృష్ణ‌వంశీ ఈ చిత్రంలో ఓ పాట‌ని చిత్రీక‌రించ‌నున్న‌ట్టు కూడా ఆయ‌న తెలిపారు.

2835
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles