డిస్కోరాజా ముహూర్తం ఫిక్స్ చేశాడు..!

Tue,January 14, 2020 11:25 AM

మాస్ రాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 24న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో చిత్ర ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు మేక‌ర్స్ . జ‌న‌వ‌రి 19న డిస్కోరాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్‌లో ఈ వేడుక ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్ క‌థానాయిక‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు. కాగా, ర‌వితేజ ప్ర‌స్తుతం క్రాక్ అనే చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ సాయంత్రం రానుంది.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles