'డిస్కోరాజా' వ‌చ్చేశాడు

Tue,September 3, 2019 08:53 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా విడుద‌లైంది. సోఫాలో దర్జాగా కూర్చుని ఓ చేతిలో సిగార్ పట్టుకుని మరో చేతిలో గన్నుతో చిరునవ్వు చిందిస్తున్న‌ రవితేజ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంతో అయిన ర‌వితేజ ప్రేక్ష‌కులని అలరిస్తాడా అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. డిసెంబర్ 20,2019న విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. రివేంజ్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతుంది.

45
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles