డియ‌ర్ కామ్రేడ్ నుండి 'గిర గిర గిర' మెలోడి సాంగ్ విడుద‌ల‌

Thu,June 20, 2019 12:04 PM

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన కాంబినేషన్ లో రూపొందిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ట్యాగ్ లైన్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేయ‌నున్నారు. ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రం నుండి గిర గిర గిర అంటూ సాగే పాట విడుద‌ల చేశారు. రెహ‌మాన్ లిరిక్స్ అందించ‌గా, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్‌, యామిని ఘంట‌సాల పాట‌ని ఆల‌పించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ స్వరాలు అందించారు. పెళ్లి నేప‌థ్యంలో వ‌చ్చే సాంగ్‌గా గిర గిర గిర ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. చిత్రంకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పాట‌ల‌ని విడుద‌ల చేయ‌గా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా విడుద‌లైన మూడో పాట‌ని మీరు విని ఎంజాయ్ చేయండి.

1852
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles