ప్ర‌భాస్‌ని క‌లిసే గొప్ప అవ‌కాశం

Tue,August 27, 2019 12:28 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కి దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగాను అభిమానులు ఉన్నారు. దాదాపు రెండేళ్ళ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం సాహో ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుండ‌డంతో ఈ సినిమా చూసేందుకు జ‌నాలు చాలా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్ కూడా అభిమానుల‌లో అంచ‌నాలు పెంచేందుకు జోరుగా ప్ర‌మోష‌న్స్ చేసుకుంటున్నారు. తాజాగా ప్ర‌భాస్ త‌న అభిమానుల‌కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. త‌న‌ని క‌ల‌వాల‌నుకున్న అభిమాని సాహో పోస్ట‌ర్‌తో సెల్ఫీ దిగి, ఆ ఫోటోని ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌కి షేర్ చేయాల‌ని అన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ . ఇందులో ల‌క్కీ విన్న‌ర్స్‌ని ఎంపిక చేసి ప్రభాస్ వారితో పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతారట. ఈ విషయాన్ని ప్రభాస్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ కాంటెస్ట్‌లో పాల్గొని ప్ర‌భాస్‌ని క‌లిసే అరుదైన అవ‌కాశం పొందండి.


3431
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles