గోల్‌మాల్ ఎగైన్ అఫీషియల్ ట్రైలర్ విడుదల

Fri,September 22, 2017 01:48 PM
Golmaal Again MOVIE TRAILER

బాలీవుడ్‌లో గోల్‌మాల్ సిరీస్‌లో వచ్చిన సినిమాలన్ని మంచి విజయం సాధించడంతో ఇప్పుడు గోల్‌మాల్ ఎగైన్ పేరుతో కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ దేవగణ్, పరిణితీ చోప్రా, తుషార్ కపూర్, టబు, కునాల్ కేము, శ్రేయాస్ టాల్పేడ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నారు . గోల్‌మాల్ సిరీస్‌లో నాలుగో భాగంగా రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఓ ఇంట్లో ఫ్రెండ్స్ గ్యాంగ్ దెయ్యాల నుండి ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్ ఫేస్ చేశారనేది ఇందులో చూపించనున్నారు. ఇక కామెడీ కోసం తొలిసారి జానీ లీవర్ చిత్ర టీంతో కలవగా, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. మరి తాజాగా విడుదలైన ఇంట్రెస్టింగ్ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.

1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles