గోపిచంద్ 28వ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Thu,September 19, 2019 10:06 AM

తొలుత విల‌న్‌గా రాణించిన గోపిచంద్ ప్ర‌స్తుతం హీరోగా వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. త్వ‌ర‌లో చాణ‌క్య అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు.. ఇక బిను సుబ్రమణ్యం అనే కొత్త ద‌ర్శ‌కుడి డైరెక్ష‌న్‌లోను ఓ సినిమా చేస్తున్నాడు గోపిచంద్. తాజాగా గోపిచంద్ 28వ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో గోపిచంద్ 28వ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుండ‌గా, ఈ చిత్రాన్ని సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై నిర్మిస్తున్నారు. సంప‌త్ నంది- గోపి చంద్ కాంబినేష‌న్‌లో గౌతమ్ నందా అనే చిత్రం తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. 2017లో విడుద‌లైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ పొందింది. తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.
976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles