మెగా హీరోకి షాక్ ఇచ్చిన విదేశీ ఫ్యాన్స్

Wed,December 20, 2017 10:19 AM
great welcome to vinayak movie unit

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినిమా మార్కెట్ విస్తృతంగా పెరిగింది. విదేశాల‌లో కూడా మ‌న సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు కొల్ల‌గొడుతున్నాయి. టాలీవుడ్‌ హీరోల‌కి అక్క‌డ కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, బాల‌య్య వంటి హీరోల‌ని విదేశీ ప్ర‌జ‌లు ఎంత‌గానో ఆరాధిస్తుంటారు. అయితే తాజాగా సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌కి మ‌స్క‌ట్‌లో ల‌భించిన ఆద‌ర‌ణ అత‌నిని షాక్‌లో ప‌డేసింది. తేజూ ప్ర‌స్తుతం వివి వినాయ‌క్ ద‌ర్వ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి ఇందులో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమా పాట‌లు , రెండు యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం చిత్ర యూనిట్ ఒమన్ దేశానికి పయనమయ్యారు . మస్కట్ సిటీ విమానాశ్రయంలో దిగగానే తేజూకి చిరు అభిమానుల నుండి సాద‌ర స్వాగ‌తం ల‌భించింది. మెగా మేన‌ల్లుడు వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ పెద్ద దండ‌ల‌తో ఎదురొచ్చి , వారికి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం ప‌లికారు. వేరే దేశంలో త‌మ‌కి ల‌భించిన ఈ ఆద‌ర‌ణ‌కి చిత్ర యూనిట్ తెగ సంతోష‌ప‌డిపోయింద‌ని తెలుస్తుంది. గ‌తంలో ఈ చిత్రానికి ఇంటిలిజెంట్, దుర్గ‌ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు రాగా, తాజాగా ధ‌ర్మా బాయ్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ టైటిల్‌ని బ‌ట్టి చూస్తుంటే ఇదొక ప‌క్కా మాస్‌, యాక్ష‌న్ మూవీ అని అర్ధ‌మ‌వుతుంది.

5542
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles