ట్రైల‌ర్‌తో అంచనాలు పెంచ‌బోతున్న ఆర్ఎక్స్ 100 హీరో

Tue,July 16, 2019 11:07 AM
Guna369 Trailer Out Tomorrow

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కుర్ర హీరో కార్తికేయ . చివ‌రిగా హిప్పీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ హీరో అభిమానుల‌ని నిరాశ‌ప‌ర‌చాడు ది. ప్ర‌స్తుతం అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో గుణ 369 అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంకి సంబంధించి ఇటీవ‌ల టీజర్ విడుద‌ల కాగా ఇందులో స‌న్నివేశాలు సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఆగ‌స్ట్ 2న గుణ 369 చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని తిరుమ‌ల రెడ్డి, అనీల్ క‌డియాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చింత‌న్ భ‌ర‌ద్వాజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా పని చేస్తున్నారు. ర‌స్టిక్ ల‌వ్ స్టోరీగా ఉండ‌నున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న అన‌గ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. జూలై 17 ఉద‌యం 11.11 ని.లకి చిత్ర ట్రైల‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను ట్రైల‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ట్రైల‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాల‌ని టీం భావిస్తుంది.

1319
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles