హ్యాపీ బ‌ర్త్‌డే టూ సినీ లెజెండ్స్‌

Thu,November 7, 2019 08:43 AM

న‌వంబ‌ర్ 7.. సినీ అభిమానుల‌కి ఈ రోజు చాలా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. అందుకు కార‌ణం ఇండ‌స్ట్రీలో టాప్ స్టార్స్ గా పిల‌వ‌బ‌డే క‌మ‌ల్ హాస‌న్‌, అనుష్క‌, త్రివిక్ర‌మ్, మెహర్ ర‌మేష్‌లు పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా అభిమానులు త‌మ స్టార్స్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ప్ర‌త్యేకంగా జ‌రుపుకుంటున్నారు. ముఖ్యంగా క‌మ‌ల్ హాస‌న్ నేటితో 65వ వ‌సంతంలోకి అడుగుపెట్ట‌డంతో పాటు ఇండ‌స్ట్రీలో 60 ఏళ్ళ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ పూర్తి చేశాడు. ఈ నేప‌థ్యంలో చెన్నైలో క‌మ‌ల్ హాస‌న్ పేరిట‌ ప‌లు కార్య‌క్ర‌మాల‌ని చేప‌డుతున్నారు. ఇక హీరోల‌కి స‌మానంగా పోటీ ఇస్తున్న అందాల భామ అనుష్క బ‌ర్త్‌డే కూడా నేడే. ఈ క్ర‌మంలో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేస్తున్నారు అనుష్క ఫ్యాన్స్‌. బ‌న్నీతో అల‌.. వైకుంఠ‌పుర‌ములో సినిమా చేస్తున్న మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ బ‌ర్త్‌డే కూడా నేడే. ఆయ‌న ఈ సారి త‌న బ‌ర్త్‌డేని అల‌.. వైకుంఠ‌పుర‌ములో టీంతో క‌లిసి సెలబ్రేట్ చేసుకోనున్నట్టు తెలుస్తుంది. అప్ప‌టి ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ బ‌ర్త్‌డే నవంబ‌ర్ 7న కావ‌డంతో ఆయ‌న‌కి నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

1500
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles