అవార్డు రావడం సంతోషంగా ఉంది: జైరా వసీమ్

Fri,April 7, 2017 04:57 PM
happy to conferred with award zaira Wasim


ముంబై: 64వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తనకు ఉత్తమ సహాయనటిగా అవార్డు రావడం పట్ల దంగల్ ఫేం జైరా వసీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘మొదటి సినిమాకే జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల ఎంతో ఆనందంగా ఉంది. దంగల్ మూవీకి ఉత్తమసహాయ నటిగా అవార్డు రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని’ జైరా వసీమ్ వెల్లడించింది. రెజ్లర్ మహవీర్ సింగ్ ఫోగట్ బయోపిక్ దంగల్ లో జైరా వసీమ్ గీతా ఫోగట్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన విషయం తెలిసిందే. దంగల్ మూవీలో తన పాత్ర కోసం జైరా వసీమ్ రెజ్లింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది.

1155
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles