కిచెన్‌లో సందడి చేసిన జాన్వీ కపూర్.. వీడియో

Sat,March 30, 2019 05:40 PM
Have you seen Janhvi Kapoor Kitchen which is going viral

జాన్వీ కపూర్.. బాలీవుడ్‌లో చేసింది ఒకటే సినిమా అయినా తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. అతిలోకసుందరి శ్రీదేవి కూతురు కావడం ఒక కారణమయితే.. తన అందంతో కుర్రకారును ఆకట్టుకునే అభినయం జాన్వీ సొంతం. దీంతో తనకు ఆటోమెటిక్‌గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే.. సినిమాల విషయం పక్కన బెడితే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ.

తన వర్క్‌కు సంబంధించిన ఫోటోలే కాదు... తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా తన ఫ్యాన్స్‌తో సోషల్ మీడియాలో పంచుకుంటుంది జాన్వీ. ఇటీవల తన కోస్టార్, దఢక్ హీరో ఇషాన్ ఖట్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో జాన్వీ కిచెన్‌లో ఏదో వండుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కిచెన్‌లో బాగానే కుస్తీ పడుతున్నావు జాన్వీ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తన సినిమాల విషయానికి వస్తే.. జాన్వీ మరాఠీ సినిమా సైరట్ రిమేక్‌లో నటించింది. ప్రస్తుతం తన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. కరణ్ జోహార్ సినిమా తక్త్, హార్రర్ కామెడీ సినిమా రూహ్ అఫ్జాలో నటిస్తోంది. త్వరలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.View this post on Instagram

Y u photobomb?? Was going for a nice picture of open sky.

A post shared by Ishaan (@ishaankhatter) on

1540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles