కారు బోల్తా.. పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డ హేమంత్

Sun,May 19, 2019 11:01 AM
hemanth met with an accident

యాంక‌ర్, ఆర్జే, న‌టుడిగా త‌న‌దైన శైలిలో వినోదాన్ని పండిస్తున్న హేమంత్ రీసెంట్‌గా మ‌హ‌ర్షి చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రంలో మ‌హేష్ స్నేహితుడిగా క‌నిపించాడు. నిన్న విజ‌యవాడ‌లో జ‌రిగిన మ‌హ‌ర్షి విజ‌యోత్సవ వేడుక‌కి హేమంత్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే వేడుక ముగిసిన త‌ర్వాత కారులో హైద‌రాబాద్‌కి తిరుగు ప్ర‌యాణం కాగా, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో హేమంత్ కారు ప‌ల్టీ కొట్టింది. జగ్గయ్యపేట మండలం మహమ్మద్ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా ఓ గేదె స‌డెన్‌గా ప్ర‌త్య‌క్షం కావ‌డంతో దానిని త‌న కారుతో ఢీకొట్టాడు. దీంతో ఆయ‌న వాహ‌నం అదుపుతప్పి ప‌ల్టీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో హేమంత్ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టు తెలుస్తుంది. ప్ర‌మాదం జ‌రిగిన సమ‌యంలో అతడే కారు డ్రైవ్‌ చేస్తున్నట్లు స‌మాచారం. ఈ ఘట‌న‌కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3618
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles