'ప్ర‌తి రోజు పండ‌గే' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Thu,September 12, 2019 08:26 AM
Here is the first look poster of Prati Roju Pandaage

సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌తి రోజు పండ‌గే అనే టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన విందు అందించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. స‌త్య‌రాజ్ కీల‌క పాత్ర‌లో కనిపించ‌నున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో స‌త్య‌రాజ్ జంప్ చేస్తుంటే తేజూ ప‌డిపోతావు అన్న‌ట్టుగా ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చాడు. చిత్రంలో వీరిద్ద‌రు తండ్రి , కొడుకులుగా క‌నిపిస్తార‌ని టాక్. చిత్ర ఫ‌స్ట్ లుక్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. డిసెంబ‌ర్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు .థ‌మన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

1025
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles