వెరైటీ పోస్ట‌ర్‌తో వ‌చ్చేసిన 'బ్రోచేవారెవ‌రురా'

Mon,December 31, 2018 10:43 AM

ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి.. ఊళ్ళోవారంద‌రి దిష్టి ఈ 2019లో ఎవ్వ‌రికి త‌గ‌ల‌కూడ‌ద‌ని ఆశిస్తూ శుభంభూయాత్ !! అంటూ ఓ వెరైటీ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు బ్రోచేవారెవ‌రురా టీం. మెంట‌ల్ మ‌దిలో వంటి చిత్రాన్ని తెర‌కెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ఇందులో శ్రీ విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. చిత్రంలో నివేదా థామస్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించనున్నారు. సత్యదేవ్ .. ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకులకు ఆక‌ట్టుకుంటుందని టీం చెబుతుంది. అయితే టైటిల్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా ఖ‌చ్చితంగా వినూత్నంగా ఉంటుందని ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. బ్రోచేవారెవ‌రురా అనే చిత్ర టైటిల్‌కి 'చలనమే చిత్రము .. చిత్రమే చలనము' అనేది ట్యాగ్ లైన్‌గా ఉంచారు. ఈ చిత్రంపై పూర్తి డీటైల్స్ త్వ‌ర‌లోనే రానున్నాయి.

1725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles