ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన శ‌ర్వానంద్.. వీడియో

Sat,June 22, 2019 09:03 AM

96 తెలుగు రీమేక్ కోసం థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంటున్న శ‌ర్వానంద్ అనుకోకుండా ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో రెండు రోజులు బాగానే ప్రాక్టీస్ చేసిన శ‌ర్వానంద్ మూడోరోజు నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. ఐదోసారి ల్యాండ్ అయ్యే స‌మ‌యానికి గాలి ఎక్కువ‌గా రావ‌డంతో కాళ్ళ‌పై ల్యాండ్ కావ‌ల‌సిన అత‌ను భుజాల‌ని మోపి ల్యాండ్ అయ్యాడు. దీంతో శ‌ర్వానంద్ షోల్డ‌ర్ డిస్ లొకేట్ అయింది. కాలు కూడా ఫ్రాక్చ‌ర్ అయింది. కొద్ది రోజుల పాటు స‌న్‌షైన్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న శ‌ర్వా నిన్న డిశ్చార్జ్ అయ్యారు.


మెరుగైన వైద్యం అందించి గాయం త్వ‌ర‌గా మానేలా చేశామ‌ని సన్‌షైన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం శ‌ర్వా ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని, కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొన‌వ‌చ్చని ఆయ‌న తెలిపారు. డైట్‌కి సంబంధించిన స‌ల‌హాలు సూచ‌న‌లు కూడా శ‌ర్వాకి ఇచ్చిన‌ట్టు వైద్యులు తెలిపారు. శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం ర‌ణ‌రంగం చిత్రంతో పాటు 96 రీమేక్ చేస్తున్నాడు. 96 రీమేక్‌లో శ‌ర్వానంద్ స‌ర‌స‌న స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తుంది. త‌మిళ వ‌ర్షెన్‌ని తెర‌కెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగులోను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి జాను లేదా జానకి దేవి అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు స‌మాచారం. చిత్రంలో శ‌ర్వానంద్ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో కనిపించ‌నుండ‌గా, ఆయ‌న గార్ల్‌ఫ్రెండ్ పాత్ర‌లో స‌మంత క‌నిపించ‌నుంది.

1914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles