హిస్టారికల్ మూవీస్ పై ఇంట్రెస్ట్ పెడుతున్న హీరోలు..!

Fri,October 7, 2016 07:16 AM

ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ సినిమాల ధోరణిలో మార్పు వచ్చింది. లవ్, యూత్ సినిమాలు ఎన్నో వస్తున్నా ... అంతకు మించి ఏదో వెరైటీగా చూపించాలనే ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనల ఫలితంగానే చారిత్రక చిత్రాలు వస్తున్నాయి. రొమాంటిక్ హీరోలు కూడా హిస్టారికల్ కేరక్టర్స్ వేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.


కొన్నేళ్ల నుంచీ హిస్టారికల్ పిక్చర్స్ జోరెక్కువైంది. టాలీవుడ్ లో ఆ మధ్య మగధీర వచ్చింది. గత ఏడాది బాహుబలి, రుద్రమదేవి ఇదే నేపథ్యంలో తెరకెక్కి రిలీజ్ అయ్యాయి. ఇక రీసెంట్ గా బాలకృష్ణ తన 100వ సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణిలో నటిస్తున్నాడు. ఈ చిత్రం హిస్టారికల్ మూవీనే. అటు బాలీవుడ్ ను తీసుకుంటే...ఇటీవల విడుదలైన భాగ్ మిల్ఖా భాగ్, బాజీరావు మస్తానీ, మొహంజదారో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో చారిత్రక సినిమా రాబోతోంది.

చారిత్రక చిత్రాలు విజయాలు కైవసం చేసుకుంటుండడంతో ...నిర్మాతలు, హీరోలు కూడా అటు మొగ్గుతున్నారు. వరస హిట్లతో జోరుగా ఉన్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఇప్పుడు ఓ హిస్టారికల్ మూవీలో చేయబోతున్నాడు. మహారాష్ట్ర యోధుడు వీర శివాజీ జీవితం ఆధారంగా తీయబోతున్న సినిమాలో సల్లూ భాయ్ యాక్ట్ చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ఈమధ్య వెరైటీ పాత్రలు ఎంపిక చేసుకుంటున్నాడు.

సుల్తాన్ సక్సెస్ తో బాలీవుడ్ లో తిరుగులేని హీరోగా రాణిస్తున్న సల్మాన్ ఖాన్ రూటు మార్చాడు. హిస్టారికల్ మూవీని ఎంచుకున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ శివాజీ చిత్రంలో శివాజీగా వేయడం లేదు. మరో కీలకమైన కేరక్టర్ వేస్తున్నాడు. విశేషమేంటంటే... సల్మాన్ కు ఆ సినిమాలో తను చేసే పాత్ర ఏంటో కూడా తెలీదు. కానీ సినిమా చేయడానికి మాత్రం ఒప్పేసుకున్నాడట.

1179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles