అలియా వ‌ల‌న ఆల‌స్య‌మవుతున్న భారీ ప్రాజెక్టులు..!

Sat,June 22, 2019 10:41 AM
high budget projects delayed due to alia bhatt

బాలీవుడ్ యంగ్ భామ అలియా భ‌ట్ ఇటీవ‌ల ప‌లు ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది . ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో పాటు క‌ళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ఆర్ఆర్ఆర్, ఇన్షా అల్లా చిత్రాలు చేస్తుంది. ఈ చిత్రాలు ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్నాయి. అయితే అలియా కొద్ది రోజులుగా పేగుల‌కి సంబంధించిన ఇన్ఫెక్ష‌న్ రావ‌డంతో విశ్రాంతి తీసుకుంటుంది. న్యూయార్క్‌లో చికిత్స తీసుకునేందుకు కూడా సిద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో అలియా క‌మిట్ అయిన చిత్రాల షూటింగ్ కొద్ది రోజుల పాటు డిలే కానున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రాజ‌మౌళి భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ టీంతో అలియా మ‌రి కొద్ది రోజులలో జాయిన్ కావ‌లసి ఉంది. కాని ఆమె అనుకోకుండా న్యూయార్క్ వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుండ‌డంతో ఆర్ఆర్ఆర్ చిత్ర షెడ్యూల్స్‌లో ప‌లు మార్పులు చేస్తున్నార‌ట జ‌క్క‌న్న‌. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ గాయాల బారిన ప‌డ‌డం వ‌ల‌న చిత్ర షూటింగ్ కొద్ది రోజుల పాటు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక అలియా వ‌ల‌న వాయిదా ప‌డ్డ బ్ర‌హ్మాస్త్రా చిత్ర షూటింగ్ కోసం ర‌ణ్‌భీర్ కపూర్ కొన్నాళ్ళ పాటు ఎక్స్‌ట్రా కాల్షీట్స్ కేటాయించ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వచ్చిన విష‌యం విదిత‌మే.

2019
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles