ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేదెవ‌రో తెలుసా ?

Sat,September 21, 2019 01:52 PM

బిగ్ బాస్ సీజ‌న్ 3 కార్య‌క్ర‌మం స‌క్సెస్‌ఫుల్‌గా సాగుతుంది. ప్ర‌స్తుతం తొమ్మిదో వారం కొన‌సాగుతుండ‌గా, ఈ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నే దానిపై ఆస‌క్తిక‌ర చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ వారం నామినేష‌న్‌లో రాహుల్‌, మ‌హేష్‌, హిమ‌జ ఉన్నారు. రాహుల్‌పై మొద‌ట కాస్త నెగెటివ్ ఓపీనియ‌న్ ఉన్న‌ప్ప‌పటికి ప్ర‌స్తుతం స్ట్రాంగ్‌గానే ఉన్నాడు. దీంతో ఇత‌ను ఈ వారం సేఫ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. హిమ‌జ‌, మ‌హేష్‌ల‌ని పోల్చి చూస్తే ప్రేక్ష‌కుల‌లో మ‌హేష్‌పై సాఫ్ట్ కార్న‌ర్ ఉన్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. దీంతో అత‌ను కూడా సేఫ్ అయ్యే అవ‌కాశాలే ఎక్కువ‌. హిమ‌జ‌పై ఇంటి స‌భ్యుల‌లో కాస్త వ్య‌తిరేక‌త ఉండ‌డంతో పాటు ఒక్కోసారి త‌న ప్ర‌వ‌ర్త‌న ప్రేక్ష‌కుల‌కి కూడా కాస్త చిరాకు క‌లిగించింద‌నే టాక్ వినిపిస్తుంది. ఏదైన అద్భుతం జ‌రిగితే త‌ప్ప హిమ‌జ సేఫ్ అయ్యి మ‌హేష్ బ‌య‌ట‌కి వెళ‌తాడు. లేదంటే హిమ‌జ‌నే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని నెటిజ‌న్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. చూడాలి మ‌రి బిగ్ బాస్ హౌజ్‌లో ఏం జ‌రుగుతుందో ?

7232
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles