అనుష్క సినిమాలో హాలీవుడ్ న‌టులు..!

Thu,December 27, 2018 11:22 AM
hollywood actors in anushka movie

బాహుబ‌లి చిత్రంలో దేవ‌సేన‌గా క‌నిపించిన అనుష్క ఆ త‌ర్వాత భాగ‌మ‌తి అనే లేడి ఓరియెంటెడ్ చిత్రంతో అలరించిన సంగ‌తి తెలిసిందే . బాహుబ‌లి చిత్రానికి గాను అనుష్క ఖ్యాతి ఖండాంత‌రాలు దాటింది. ఆమె సినిమాలో న‌టించేందుకు ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టులు కూడా స‌న్న‌ద్ధంగా ఉన్నార‌నేది తాజా స‌మాచారం. వివరాల‌లోకి వెళితే భాగ‌మ‌తి అనే థ్రిల్ల‌ర్ చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క త్వ‌ర‌లో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేయ‌నుంది. కోన వెంక‌ట్ నిర్మించ‌నున్న ఈ చిత్రం థ్రిల్ల‌ర్ మూవీగా ఉంటుంద‌ట‌. మూవీ చిత్రీక‌ర‌ణ ఎక్కువ శాతం అమెరికాలో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. అయితే బాహుబ‌లి చిత్రంలో న‌టించిన అనుష్క త‌మ‌తో చిత్రం చేస్తుంద‌ని చెప్ప‌గానే హాలీవుడ్ న‌టులు మా సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యారు అని కోన వెంక‌ట్ ఓ ఆంగ్ల ప‌త్రిక‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మాధ‌వ‌న్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు అని అంటున్నారు. తెలుగు త‌మిళ భాష‌ల‌లో చిత్రాన్ని రూపొందించేందుకు కోన వెంక‌ట్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తుంది.

2746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles