ముంబైలో డ్రమ్స్ వాయించిన హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్..వీడియో

Sun,September 8, 2019 05:57 PM
Hollywood music producer beats drums in mumbai vedio viral


ముంబై: హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ముంబైకి వచ్చాడు. ముంబైలోని ఓ గణేశుని మండపం దగ్గర కళాకారులతో కలిసి డ్రమ్స్ వాయించి సందడి చేశాడు. హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ వాయిస్తున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. మీరెపుడైనా మన కళాకారుల టీం ప్రతీ ఏటా గణేశుని నిమజ్జనోత్సవాల్లో అంతర్జాతీయ స్ట్ర్రీట్ డ్రమ్స్ ఫెస్టివల్ ను నిర్వహించాలనుకున్నారా..? ఇపుడు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ వాయించడంతో మన గణేశ్ ఉత్సవాలు ప్రపంచఖ్యాతి పొందాయని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే.




2054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles