అర్ధ‌రాత్రి బ్యాగుల‌తో బ‌య‌టకి వ‌చ్చిన ఇంటి స‌భ్యులు..ఒక‌రు సేఫ్‌

Sat,October 26, 2019 08:21 AM

బిగ్ బాస్ 97వ‌ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ముందుగానే విడుద‌ల కాగా, ఇది చూసిన ప్రేక్ష‌కులు ఈ ఎపిసోడ్‌లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంద‌ని ఊహించారు. కాని అలాంటిదేమి లేకుండా నామినేష‌న్‌లో ఉన్న ఐదుగురు స‌భ్యుల‌లో ఒక‌రిని సేవ్ చేసి మిగ‌తా న‌లుగురిని లోప‌లికి వెళ్ళ‌మ‌ని చెప్పారు. ఇక ఎపిసోడ్ మొదట్లో ఇంటి స‌భ్యులు అంద‌రు కొత్త డ్రెస్‌ల‌లో మెరిసారు. స్టేజ్‌పై ర్యాంప్ వాక్ చేశారు. మ‌గ‌వాళ్ళ‌లో బాబా భాస్కర్ అద్భుతంగా ర్యాంప్ వాక్ చేసిన‌ట్టు శ్రీముఖి, శివ‌జ్యోతి తెలుప‌గా ఆడ‌వాళ్ళ‌లో శివ‌జ్యోతిని విజేత‌గా ప్ర‌క‌టించారు.


కొద్ది సేపటి త‌ర్వాత అంద‌రు నిద్ర‌లోకి ఉప‌క్ర‌మించ‌గా, ఓ పెద్ద బ‌జ‌ర్ శ‌బ్ధం వినిపించింది. వెంట‌నే ఉలిక్కిప‌డి లేచిన ఇంటి స‌భ్యుల‌ని ల‌గేజ్‌తో గార్డెన్ ఏరియాలోకి రావాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ ఆదేశానుసారం ఒక్కో ఇంటి స‌భ్యుడు త‌మ ల‌గేజ్‌ల‌తో గార్డెన్ ఏరియాలో వ‌చ్చి అక్క‌డ‌ ఉన్న పోడియంపైకి ఎక్కి నిలుచున్నారు. ఇంత‌లో బిగ్ బాస్ మీ అనుభ‌వాల‌ని షేర్ చేసుకునే స‌మ‌యం ఆసన్న‌మైంది. మీకు ఇంట్లో ఎదురైన అనుభ‌వాలు, మీ ప్ర‌యాణం గురించి మ‌న‌సు విప్పి మాట్లాడుకునే ఛాన్స్ బిగ్ బాస్ ఇస్తున్నారు. చివ‌రి సారిగా మీ అనుభ‌వాలు షేర్ చేసుకోండి అని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు.

ముందుగా వ‌రుణ్ సందేశ్ ప్ర‌క్రియ మొద‌లు పెట్ట‌గా, తాను వచ్చింది బిగ్ బాస్ హౌజ్ ఎక్స్‌పీరియ‌న్స్ చేద్దామ‌నే . మొదట్లో నేను అంద‌రితో మింగిల్ కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. కాని ఇప్పుడు అంద‌రు చాలా క్లోజ్ అయ్యారు. ఇక్క‌డికి రావ‌డం వ‌ల‌న షార్ట్ టెంప‌ర్‌ని చాలా కంట్రోల్ చేసుకున్నాను. బ‌య‌ట కూడా ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. ఇక్క‌డ దాదాపు 15 మంది కొత్త వారితో జ‌ర్నీ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. బాబా భాస్క‌ర్ గారిని చూసి చాలా నేర్చుకున్నాను అని వ‌రుణ్ పేర్కొన్నాడు.

అనంత‌రం బాబా భాస్క‌ర్ కూడా త‌న అనుభ‌వాలు వివ‌రించారు. నేను ఎవ‌రితో అయితే క్లోజ్‌గా ఉంటున్నానో వారు ఒక్క‌రొక్క‌రిగా బ‌య‌ట‌కి వెళ్ళారు. ప్రేక్ష‌కులు న‌న్ను ఓట్‌తో ఎంక‌రేజ్ చేస్తున్నందున నేను గేమ్ బాగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్రేక్ష‌కుల వ‌ల‌న నేను ఇంత దూరం వ‌చ్చాను అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు అని బాబా పేర్కొన్నారు. ఇక శ్రీముఖి మాట్లాడుతూ ఒక‌రి చెప్పిన సూచ‌ల‌ని ఫాలో అవ‌డం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇది ఎప్ప‌టికి గుర్తుండిపోతుంది. న‌న్ను స‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క అభిమానికి పెద్ద థ్యాంక్స్‌. హౌజ్‌మేట్స్ అంద‌రిని బ‌య‌ట క‌ల‌వ‌గ‌ల‌ను కాని బిగ్ బాస్ వాయిస్‌ని త‌ప్పక మిస్ అవుతాను అని పేర్కొంది.

ఇక అలీరెజా తాను బిగ్ బాస్ షోతోనే బాగా ఫేమ‌స్ అయ్యానని అన్నాడు. సీరియ‌ల్స్‌లో న‌టించిన, రాని ఫేమ్ కేవ‌లం బిగ్ బాస్ వ‌ల‌న‌నే సాధ్య‌మైంద‌ని ఆయ‌న పేర్కొన్నాడు. ఇక న‌న్ను ఇంత‌గా అభిమానించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్యవాదాలు అని స్ప‌ష్టం చేశాడు. చివ‌రిగా శివ‌జ్యోతి మాట్లాడుతూ.. టీవీలో చూసింది వేరు. ఇక్క‌డ జ‌రుగుతుంది వేరు. ఏడ‌వ‌డం నాలో నెగెటివ్ అంటారు కాని అది ఎమోష‌న్‌. మ‌న‌సులో ఏమి ఉండ‌దు. ఎమోష‌న్స్‌తో కూడా ఆట ఆడ‌వ‌చ్చు అని న‌మ్మి ఇంత వ‌ర‌కు వ‌చ్చాన‌ని శివ‌జ్యోతి పేర్కొంది.

కొద్ది సేప‌టి త‌ర్వాత గార్డెన్ ఏరియాలో ఉన్న గ్రీన్‌ లైట్స్ వెలుగుతూ ఆగుతూ వ‌చ్చి చివ‌రికి బాబా బాస్క‌ర్‌పై గ్రీన్ లైట్ ఆగింది. దీని అర్ధం ప్రేక్ష‌కులు వారి ఓటుతో మిమ్మ‌ల్ని సేవ్ చేశారు.మీరు టాప్ 5లో ఒక‌రిగా నిలిచారు అని బిగ్ బాస్ తెలిపారు. క‌న్ఫెష‌న్ రూంకి బాబాని పిలిచిన బిగ్ బాస్ ఆయ‌న‌కి టిక్కెట్ టూ ఫినాలే ఇచ్చారు. ఇది చూసిన ఆయ‌న చాలా సంతోషించారు. ఇక నేడు నాగ్ ఇంటి స‌భ్యుల‌తో క‌లిసి సంద‌డి చేయ‌నుండ‌గా, రేపు బిగ్ బాస్ హౌజ్ నుండి ఒక‌రు బ‌య‌ట‌కి వెళ్ల‌నున్నారు.

6658
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles