చేప నోట్లో మౌత్ ఆర్గాన్.. నాన్ స్టాప్‌గా ఊదిన శ్రీముఖి

Thu,October 24, 2019 08:09 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3కి మ‌రి కొద్దిరోజుల‌లో ఎండ్ కార్డ్ ప‌డ‌నుంది. ఈ వారం ఇంటి నుండి ఒక‌రు బ‌య‌ట‌కి వెళ్ళ‌నుండ‌గా, ఐదుగురు ఇంటి స‌భ్యులు ఫైన‌ల్ పోటీదారులుగా ఉంటారు. అయితే రాహుల్ ఇప్ప‌టికే ఫైన‌ల్‌కి చేరుకోగా మిగ‌తా ఐదుగురు స‌భ్యులు త‌మ‌ను తాము నిరూపించుకొని ఓట్లు పొందేందుకు కొన్ని ఛాలెంజ్‌లు ఇచ్చారు బిగ్ బాస్‌.


ఛాలెంజ్‌లు చేసే ముందు ఇంటి స‌భ్యుల‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న‌ నామినేటెడ్ బాక్స్ లో నిలుచోమ‌ని చెప్పారు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే ఈవారం నామినేట్ అయిన సభ్యులంతా ఆ బాక్సులోకి వెళ్లారు. పోస్ట్ బాక్స్‌లో బెల్ మోగ‌గానే అందులో నుండి ఒక లెట‌ర్ వ‌స్తుంది. ఆ లెట‌ర్‌లో చేయాల్సిన ఛాలెంజ్ రాసి ఉంది. దానిని రాహుల్ చ‌దివి వినిపించ‌గా, త‌మ‌కి న‌చ్చిన ఛాలెంజ్‌ల‌ని ఇంటి స‌భ్యులు స్వీక‌రించారు

ముందుగా వ‌రుణ్ సందేశ్ ఛాలెంజ్‌ని స్వీక‌రించ‌గా ఆయ‌న‌కి రింగ్ ఛాలెంజ్ ఇచ్చారు. ఇందులో మంట‌తో ఉన్న రింగ్‌, పోల్ ఇచ్చారు. పోల్ అనేది మంట‌కి రింగుకి తాక‌కుండా ప‌ట్టుకోవాలి. రింగుకి లేదా మంట‌కి పోల్ తాకిన‌ట్టుయితే రింగు మొత్తం మంట వ్యాపిస్తుంది. ఐదు ఛాన్స్‌లు వ‌రుణ్‌కి ఇవ్వ‌గా, రెండు మాత్ర‌మే అత‌ను ఉప‌యోగించుకున్నాడు. ఇక బాబా భాస్క‌ర్ రెండో ఛాలెంజ్ స్వీక‌రించగా.. ఈ ఛాలెంజ్‌లో పోల్ ఎక్కి టాస్క్ ముగిసేవ‌ర‌కు కింద కాలు పెట్ట‌కుండా నిలుచోవాలి. దీనిని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాడు బాబా.

ఇక మూడో ఛాలెంజ్‌గా శివ‌జ్యోతికి కోడిగుడ్డు టాస్క్ వ‌చ్చింది. ప‌చ్చి పాల‌లో కోడిగుడ్డు ప‌గ‌ల‌గొట్టి టాస్క్ పూర్త‌య్యే వ‌ర‌కు తాగుతూనే ఉండాలి. దీనిని శివ‌జ్యోతి కూడా స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఇక నాలుగో ఛాలెంజ్‌ని అలీ రెజా స్వీక‌రించాడు. ఈ ఛాలెంజ్ బ‌ల‌ప‌రీక్ష‌కి సంబంధించిన‌ది కాగా, ఒక పోల్‌కి రెండు ఇసుక మూటలు వేలాడ దీశారు. ఆ మూటలు రెడ్ కలర్ లైన్ కిందికి రాకుండా చూసుకుంటూ తాళ్లను చేతులతో పట్టుకోవాలి. టాస్క్ ముగిసే సమయం వరకు ఇలానే ఉండాలి. అంతేకాదు, ఈ ఛాలెంజ్‌ను నిలబడి మాత్రమే చేయాలి. దీనికి న్యాయం చేశాడు అలీ.

చివ‌రికి శ్రీముఖికి ఓ వినూత్న‌మైన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో పెద్ద చేప నోట్లో మౌత్ ఆర్గాన్ పెట్టి దానిని ఊదుతూనే ఉండాల‌ని చెప్పారు. ముందుగా టాస్క్ చేయ‌డంలో కాస్త ఇబ్బంది ప‌డ్డ రాముల‌మ్మ చివ‌రాక‌రి వ‌ర‌కు ఊదుతూనే ఉంది. మొత్తానికి టాస్క్‌లో పాల్గొన్న ఇంటి స‌భ్యులు అంద‌రు త‌మ ఛాలెంజ్‌ల‌ని విజ‌యవంతంగా పూర్తి చేశారు.

6990
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles