పెళ్ళి చూపుల్లో తెగ సిగ్గుప‌డ్డ శ్రీముఖి

Fri,September 27, 2019 08:26 AM

బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌దోవారంలో ఇంటి స‌భ్యుల‌కి కెప్టెన్ టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్ కోసం మూడు జంట‌లు గోడ క‌ట్టాల్సి ఉండ‌గా, అంద‌రు చాలా శ్ర‌మించారు. టాస్క్ ఆడే స‌మ‌యంలో వ‌రుణ్‌, రాహుల్‌, వితికా మ‌ధ్య ఏర్ప‌డిన చిన్న గొడ‌వ కార‌ణంగా రాహుల్‌, వ‌రుణ్‌లు బ‌ద్ద శత్రువులుగా మారారు. ఇంత‌క‌ముందు ఎంతో ఫ్రెండ్లీగా క‌నిపించిన వారిద్ద‌రు దూరం దూరంగా ఉంటున్నారు.


67వ ఎపిసోడ్‌లో జ‌రిగిన గొడ‌వ‌ కార‌ణంగా ఇంట్లో వాళ్లంద‌రు ఒక్క‌టి కాగా, రాహుల్, పున‌ర్న‌వి స‌ప‌రేట్ అయ్యారు. ఇంటి స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న గురించి రాహుల్‌, పున్ను కొద్దిసేపు చ‌ర్చించుకున్నారు. వరుణ్ మాటలు చూస్తుంటే మగతనం అనిపించడం లేదు.. నేను స్టార్టింగ్ నుండి ఎలా ఉంటున్నానో ఆయనకు ఇప్పుడే తెలిసిందట. ఛీ.. ఛీ ఇంత ఫూలిష్‌గానా? అంటూ తెగ బాధపడ్డారు రాహుల్. కొద్ది సేప‌టి త‌ర్వాత ఇంటి స‌భ్యులు బిగ్ బాస్‌ని బ్ర‌తిమిలాడి సాంగ్‌ని ప్లే చేయించుకున్నారు. సాంగ్ ప్లే కాగానే వ‌ర్షంలో చిందులేస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.

ఇక శివ‌జ్యోతి త‌న కొడుకులు ల‌వ్ మ్యారేజ్ చేసుకొని వెళ్లిపోయార‌ని చెబుతూ, మీ పెళ్లి చూపులు నేను చూడ‌లేక‌పోయాను. పెళ్లి చూపులు ఎలా జ‌రిగాయో కాస్త చూపిస్తారా అని కొడుకుల‌ని కోరింది. దీంతో పెద్ద కొడుకు ర‌వికృష్ణ‌, పెద్ద కోడ‌లు శ్రీముఖి పెళ్లి చూపుల సీన్‌ని లైవ్‌లో ఆమెకి చూపించారు. పెళ్లి కూతురిలా శ్రీముఖి తెగ సిగ్గు ప‌డుతూ రావ‌డం , కింద కూర్చొని త‌ల పైకి లేప‌కపోవ‌డం, దీనిపై బాబా భాస్క‌ర్ పంచ్‌లు వేయ‌డం ప్రేక్ష‌కుల‌కి ఫుల్ న‌వ్వు తెప్పించాయి.

అనంత‌రం టాస్క్‌లో ఎవ‌రు గోడ పెద్ద‌దిగా క‌ట్టార‌ని బిగ్ బాస్ శివ‌జ్యోతిని కోర‌డంతో అత్త‌గా ఉన్న శివజ్యోతి ర‌వికృష్ణ‌, శ్రీముఖి పేర్లు చెప్పింది. దీంతో వారిద్ద‌రు కెప్టెన్ టాస్క్‌లో పాల్గొనేందుకు అవ‌కాశం ద‌క్కించుకున్నారు. ఇక వీలు నామా శివ‌జ్యోతి ద‌గ్గ‌ర ఉండ‌డంతో ఆమె కూడా టాస్క్‌లో పాల్గొన‌నుంది. ఇక బెస్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా అంద‌రు బాబా భాస్క‌ర్‌కి ఓటేయ‌డంతో ఆయ‌న కూడా కెప్టెన్ పోటీదారుల‌లో ఒక‌రిగా ఎన్నుకోబ‌డ్డాడు. మొత్తానికి ఈ వారం కెప్టెన్ టాస్క్‌లో శ్రీముఖి, ర‌వికృష్ణ‌, బాబా భాస్క‌ర్‌, శివ‌జ్యోతి పోటీ ప‌డ‌నున్నారు.

అయితే ఎవ‌రు ఊహించ‌ని విధంగా ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళిన అలీ రెజా మ‌ళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆయ‌న‌ని చూసిన త‌ర్వాత శివ‌జ్యోతి, ర‌వికృష్ణ‌, శ్రీముఖిల ఆనందం అవ‌ధులు దాటింది. ష‌ర్ట్ లేకుండానే హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అలీ ర‌ష్య‌న్ గార్ల్స్‌తో కొద్ది సేపు చిందేశాడు. ఆ త‌ర్వాత స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేశాడు. బ‌య‌ట శివ‌జ్యోతి ఏడుపుకు వ‌చ్చిన మీమ్స్ గురించి చెప్పాడు. ‘అక్కా.. నేను ఎలిమినేట్ అయ్యా.. చనిపోలేదు’ అంటూ మీమ్స్ చేస్తున్నారు అని ఇంటి స‌భ్యుల‌కి చెప్పుకొచ్చాడు అలీ. మొత్తానికి అలీ ఎంట్రీతో ఇంట్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొన‌గా, రానున్న రోజుల‌లో పోటీ మ‌రింత ఆస‌క్తికరంగా సాగ‌నుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

3761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles