భారీ క్యాస్టింగ్‌తో చిరు చిత్రం.. హీరోయిన్‌గా శృతి

Sun,October 13, 2019 08:29 AM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రం రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అమితాబ్ బచ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, సుదీప్, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తి బాబు , న‌య‌న‌తార వంటి స్టార్స్ చిత్రంలో భాగ‌మ‌య్యారు. చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం మంచి విజ‌య సాధించ‌డంతో చిరు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇప్పుడు అదే జోష్‌తో కొర‌టాల శివతో క‌లిసి త‌న 152వ సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.


సామాజిక సందేశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో రామ్ చ‌ర‌ణ్ .. యంగ్ చిరంజీవి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. తమిళ యంగ్ హీరో ఆర్య ఒక కీలకమైన రోల్ లో యాక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కథని మలుపు తిప్పే కీలక రోల్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించబోతున్నారట. ఇక క‌థానాయిక‌గా క‌మ‌ల్ గారాల‌ప‌ట్టి శృతి హాస‌న్‌ని ఎంపిక‌చేసిన‌ట్టు తెలుస్తుంది. కొర‌టాల తెర‌కెక్కించిన శ్రీమంతుడు చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. వీటిపై అతి త్వరలో చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. బాలీవుడ్ మ్యూజిక్ ద్వయం అతుల్-అజయ్ ఈ సినిమా కోసం సంగీతాన్ని అందించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు కొణిదెల, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నాయి.

5778
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles