బుల్లితెర కార్య‌క్ర‌మం కోసం మెగాస్టార్ పారితోషికం ఎంతో తెలుసా ?

Tue,June 26, 2018 09:12 AM

వెండితెర‌పై సంచ‌ల‌నాలు సృష్టించిన స్టార్స్ ఇప్పుడు బుల్లితెర‌కి ప‌రిచ‌యం అవుతున్నారు. రియాలిటీ షోల‌కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఆనందింప జేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ . ముందుగా హిందీలో మొద‌లైన ఈ షో తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా సీజ‌న్ 1 పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజ‌న్ 2కి నాని హోస్ట్ గా ఉన్నాడు. త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక క‌న్న‌డ షోకి సుదీప్ వ్యాఖ్యాత‌గా ఉన్నాడు. జూన్ 24 నుండి మ‌ల‌యాళంలోను బిగ్ బాస్ మొద‌లైంది. ఈ కార్య‌క్ర‌మానికి మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు . 15 మంది సెల‌బ్రిటీలు వంద రోజులు పాటు బిగ్ బాస్ హౌజ్‌లో ఉండ‌నున్నారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగ‌నున్న ఈ షో బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని అంటున్నారు. అయితే ఈ షో కోసం మోహ‌న్ లాల్ 12 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ట‌. హిందీలో మొద‌లైన బిగ్ బాస్ మానియా ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాష‌ల‌కి పాకుతుంది. అంతేకాదు అన్ని చోట్ల సూప‌ర్ హిట్ అవుతుండ‌డంతో నిర్వాహ‌కులు షోని హోస్ట్ చేసే వారికి భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

3590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles