చిరు చిత్రంలో రెండో హీరోయిన్ ఎవ‌రు ?

Wed,November 6, 2019 01:32 PM

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ కొరటాల శివ కాంబినేషన్ లో చిరు 152వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అయితే చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు బ‌య‌ట‌కి వ‌స్తున్నాయి. కథానుగుణంగా హీరోయిన్ పాత్రకు త్రిష అయితే బాగుంటుందని ఆమెని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. చిత్రంలో రెండో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉండ‌డంతో ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉంద‌ట‌. శృతి హాస‌న్ లేదా ఇలియానాల‌లో ఒక‌రు రెండో హీరోయిన్‌గా ఎంపిక కావొచ్చ‌నే టాక్ వినిపిస్తుంది. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్ర న‌టీన‌టుల‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కి రానున్నాయి. ఈ చిత్రం దేవాల‌యాల‌కు సంబంధించిన కథా నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొంద‌నుంది.

1506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles