నీ గర్ల్‌ఫ్రెండ్‌ను చంపేస్తా.. యంగ్ హీరో ఇంటి దగ్గర అభిమాని హల్‌చల్

Sun,April 7, 2019 01:32 PM
I will Kill your Girlfriend says a female fan outside Varun Dhawans home

సినిమా హీరోలకు అభిమానులతోనే స్టార్‌డమ్ అనేది వస్తుంది. అయితే కొన్నిసార్లు అదే అభిమానులు తలనొప్పిగా కూడా మారతారు. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ మహిళా అభిమాని అతని ఇంటి ముందు హల్‌చల్ చేసింది. అతన్ని కలవడానికి చాలా రోజులుగా వేచి చూస్తున్న సదరు అభిమాని.. ఎంతకీ వరుణ్ కనిపించకపోవడంతో అక్కడి సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగింది. వరుణ్ ఇంట్లో లేడని, కళంక్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడని చెప్పినా ఆమె వినలేదు. నేను నటాషా (వరుణ్ గర్ల్‌ఫ్రెండ్)ను చంపేస్తా అంటూ తెగ హడావిడి చేసింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను పిలవాల్సి వచ్చింది. ఈ ఘటనపై వరుణ్ సెక్యూరిటీ సిబ్బంది వివరణ ఇచ్చారు. సాధారణంగా అభిమానులు ఎవరు వచ్చినా.. వరుణ్ కాదనకుండా సెల్ఫీలు దిగుతారు. కానీ కొన్నాళ్లుగా బిజీగా ఉండటంతో ఆ మహిళా అభిమానిని కలవలేదు. ఇప్పుడు కలవడం కుదరదు అని చెప్పినా ఆమె వినలేదు. గొడవ పెట్టుకుంది. తాను ఆత్మహత్య చేసుకుంటానని ముందు భయపెట్టింది. అయినా సెక్యూరిటీ సిబ్బంది వినకపోవడంతో నటాషాను చంపుతా అంటూ బెదిరించింది అని వాళ్లు పోలీసులకు వివరించారు. ముంబైలోని శాంటా క్రజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

4111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles