నా ఆరోగ్యం చాలా బాగుంది: నటుడు కృష్ణంరాజు

Thu,November 14, 2019 05:40 PM


ప్రముఖ సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. వార్తలపై ఆయన స్పందిస్తూ..కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్ కు వెళ్లడం చూసిన కొన్ని పత్రికల వారు కనీస విషయ సేకరణ, నిర్ధారణ కూడా లేకుండా వార్తలు రాశారు. దీనివల్ల హాస్పిటల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాల్లో ఆందోళనకు గురయ్యే అభిమానుల పరామర్శలకు సమాధానం చెప్పటం చాలా కష్టమవుతుంది. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. చెకప్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతాను. నా ఆరోగ్యం విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఓ ప్రకటన విడుదల చేశారు.

1199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles