గ్లామర్ పాత్రలు చేసేందుకు ఒకే..

Wed,September 26, 2018 08:11 PM
Iam ready to play in glamorous roles says nabha natesh

సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది నభా నటేష్. తొలి సినిమాతోనే మంచి నటిగా ప్రశంసల్ని సొంతం చేసుకున్నది. అల్లరి, చలాకీతనం మేళవించిన పాత్రలో సహజ అభినయాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్న నభానటేష్ తెలుగులో మంచి అవకాశాల్ని దక్కించుకుంటున్నది. నన్ను దోచుకుందువటే సినిమాలో తన పాత్రకు డైలాగ్‌లు ఎక్కువ ఉండటంతో కష్టపడి తెలుగు భాషను నేర్చుకున్నానని, భవిష్యత్తులో సొంతంగా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నదామె.

కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కమర్షియల్ సినిమాలతో పాటు అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిసారిస్తానని చెబుతున్నది. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న అదుగో చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా రవితేజతో ఆమె ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నభా పాత్ర నవ్యరీతిలో సాగనున్నట్లు సమాచారం.

7157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles