పాత లుక్‌లో ఇలియానా... షేక్ చేస్తున్న గోవా భామ‌

Tue,September 24, 2019 09:08 AM

గోవా బ్యూటీ ఇలియానా చాలా గ్యాప్ త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో తెలుగు సినిమా ఆఫ‌ర్స్ ఆ అమ్మ‌డికి కరువ‌య్యాయి. అయితే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంలో చాలా లావుగా క‌నిపించిన ఇలియానా ప్ర‌స్తుతం స్లిమ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంది. మళ్లీ తన పాత ఫిజిక్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. తాజాగా బెల్లీ డ్యాన్స్ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఇందులో ఇలియానాని చూసిన అభిమానులు నోరెళ్ల‌పెడుతున్నారు. కాగా, విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన ఇలియానా అప్ప‌ట్లో సీక్రెట్‌గా వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల‌ ఇల్లీ బేబీ గ‌ర్భ‌వ‌తి అంటూ ప‌లు క‌థ‌నాలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టాయి. వీటిపై ఎవ‌రు స్పందించ‌క‌పోవ‌డం విశేషం.

3474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles