హిందీ అర్జున్‌ రెడ్డి టీజర్‌ వచ్చేసింది..

Mon,April 8, 2019 03:05 PM
In Kabir Singh teaser, Shahid Kapoor turns into Arjun Reddy

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ అర్జున్‌ రెడ్డి.. బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో రూపొందుతున్న విషయం తెలిసిందే. దక్షిణాదిలో సంచలనం రేపిన అర్జున్‌ రెడ్డి ఫిల్మ్‌లో విజయ దేవరకొండ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే కబీర్‌ సింగ్‌లో షాహిద్‌ కపూర్‌ ఆ రోల్‌ ప్లే చేస్తున్నాడు. హిందీ రీమేక్‌ను కూడా సందీప్‌ వంగా డైరక్ట్‌ చేస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్‌ పాత్ర పోషిస్తున్నది. మెడికల్‌ ప్రొఫెషనల్‌ అయిన అర్జున్‌ రెడ్డి.. తన లవర్‌ మరొకరితో సెటిల్‌ కావడంతో తాగుబోతుగా మారుతాడు. ఆ కాన్సెప్ట్‌తోనే కబీర్‌ సింగ్‌ను కూడా తీశారు. ఇవాళ రిలీజైన టీజర్‌లో అచ్చం దేవరకొండ తరహాలోనే షాహిద్‌ యాక్ట్‌ చేశాడు. బాలీవుడ్‌ను షేక్‌ చేయనున్న ఈ ఫిల్మ్‌ జూన్‌ 21వ తేదీన రిలీజ్‌ కానున్నారు.

2332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles